తెలంగాణ ఉద్యమకారులు గాదె ఇన్నయ్య మాతృమూర్తి తెరిసమ్మ కొన్ని రోజుల క్రితం మృతి చెందగా జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం సాగరం గ్రామంలో ఉన్న ఇన్నయ్య ఇంటికి సోమవారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం ఇన్నయ్య నిర్వహిస్తున్న ఆశ్రమాన్ని సందర్శించి అక్కడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల గురించి ఎవరూ మాట్లాడని సమయంలో దగాపడ్డ తెలంగాణ అనే పుస్తకాన్ని ఇన్నయ్య ప్రచురించారు. అంతేకాకుండా 1997 లో దగాపడ్డ తెలంగాణ అనే సభను నిర్వహించారన్నారు. తెలంగాణ గురించి ఎవరు మాట్లాడని సమయంలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని విప్పి చెప్పి ఎంతోమందిని ఉద్యమంలోకి తెచ్చారు. ఇన్నయ్య తల్లి మృతి చెందటంతో వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారన్నారు. ఇన్నయ్య
ఎప్పుడు ఎవరికీ అన్యాయం జరిగిన సరే బలంగా ప్రజల పక్షాన, బాధితుల పక్షాన మాట్లాడే వ్యక్తి అన్నారు.మొన్నటి ఆపరేషన్ కగార్ లో జరిగిన ఎన్ కౌంటర్లపై కూడా తన భావాలు చెప్పటంతో ఆయనను అరెస్ట్ చేశారని,తెలంగాణ ఇటువంటి ఎన్నో అరెస్టులను చూసిందని, తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఇంత పెద్ద అన్యాయం జరగటం సరైంది కాదని ఆమె భావిస్తున్నామన్నారు . ఇన్నయ్య ఎంతో ఉన్నత ఆశయంతో మా ఇల్లు అనే సంస్థను కూడా నడిపిస్తున్నారని ఎంతో మంది అనాథ పిల్లలను పెంచి పెద్ద చేసి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దిన వ్యక్తి అలాంటి మా ఇల్లు సంస్థకు, ఇన్నయ్య జాగృతి తరఫున అండగా ఉంటామన్నారు. తెలంగాణ సమాజం కూడా ఇన్నయ్య కు మద్దతుగా ఉంటుందని భావిస్తున్నాం. ఉద్యమకారులను తెలంగాణ సమాజం ఎప్పుడూ మరిచిపోలేదు. తెలంగాణ కోసం ఎంతో మంది యువకులను ఉద్యమంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ,
అందుకే ఆయనకు మద్దతుగా వారి స్వగ్రామానికి రావటం జరిగిందన్నారు



