మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
శంకరపట్నం మండలం కేశవపట్నం ప్రధాన రహదారిపై నీరు ప్రవహిస్తూ పలువురు ఇండ్ల చుట్టూ చేరి చెరువును తలపిస్తుంది.రహదారి వెంబడి నీరు ప్రవహించడంతో అధికార కార్యాలయాలకు,కరీంపేట,కేశవపట్నం, పాపయ్యపల్లి గ్రామాల ప్రజలకు,వాహనదారులకు ఈ దారే ప్రధాన రహదారి కావడంతో తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు.ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై పలువురు వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాత్కాలిక మరమ్మత్తులు కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని సమీప ప్రజలు కోరుతున్నారు.

