Breaking News

శ్రీ మార్కండేశ్వరునికి సహస్ర ఘటాభిషేకం

-పొన్న సేవ

  • -పురవీధులలో మారుమ్రోగిన ఓం నమ:శ్శివాయ

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

యాదాద్రి భువనగిరి జిల్లా,భూదాన్పోచంపల్లిలో మంగళవారం నాడు శ్రీమార్కం డేశ్వర స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. స్వామి దేవాలయ 49వ వా ర్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘటాభిషేకం , పొన్న సేవ నిర్వహింపబడింది .ఈ సందర్భంగా వందలాదిమంది మహిళలు -యువతులు స్థానిక పెద్ద చెరువు వద్ద నుండి ప్రత్యేకంగా అలంకరింపజేసిన బిందెలలో- సర్వలలో నీటిని తీసుకొని, వా టిపై టెంకాయ పెట్టి, సన్నాయి మేళాలు చప్పుల్లతో ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకు రావడం జరిగింది. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ,స్వామివారికి సహ స్ర ఘటాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఓం నమశ్శివాయ అనే శివ పంచాక్షరి మంత్రం పట్టణ పురవీధులలో మారు మ్రోగింది . మహిళలు- యువతులతో ఆల యం, ఆలయ ప్రాంగణం క్క్రిక్కిరిసింది. అనంతరం శివపంచాయతన యజ్ఞం ని ర్వహింపబడింది. ఆలయ చైర్మన్ సీత సత్యనారాయణ చే పూర్ణాహుతి చేయబ డింది. సహస్ర ఘటాభిషేకం శోభాయాత్ర టై అండ్ డై పట్టుచీరల ఉత్పత్తిదారుల సంఘం సౌజన్యంతో నిర్వహించబడగా, సహస్ర ఘటాభిషేకం కర్తలకు అన్న ప్రసా దం పంపిణీ చేశారు.పద్మశాలి యువజన సంఘం వారిచే సాంస్కృతిక కార్యక్ర మాలు నిర్వహించబడ్డాయి.