Breaking News

మన ప్రగతి నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి:

మండలంలోని మన ప్రగతి తెలుగు దినపత్రిక 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను స్థానిక ఎస్సై గోవర్ధన్, నల్లబెల్లి సర్పంచ్ నాగలి జ్యోతి ప్రకాష్, ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, ప్రజా ప్రతినిధులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ మన ప్రగతి దినపత్రిక వాస్తవాధారిత సమాచారంతో ప్రజల విశ్వాసాన్ని పొందిందని తెలిపారు. ప్రజాసమస్యలను బాధ్యతాయుతంగా ప్రతిబింబిస్తూ సమాజ హితాన్ని కాపాడే జర్నలిజాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.నూతన సంవత్సరంలోనూ పాఠకుల ఆశయాలకు అనుగుణంగా మరింత సేవాభావంతో ముందుకు సాగాలని కోరుతూ మన ప్రగతి యాజమాన్యానికి, పాఠకులకు, మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు