మన ప్రగతి న్యూస్/ నడికూడ:
77 వ గణతంత్ర దినోత్సవాన్ని పుర స్కరించుకొని సోమవారం హనుమ కొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు ప్రశంసా పత్రాలను అందించారు. ఉత్తమ తహాసిల్దార్ గా నడికూడ మండల తహాసిల్దార్ రాణి, ఉత్తమ మండల వ్యవసాయ అధికారిగా నడికూడ ఎంఈఓ పోరిక జైసింగ్, ఉత్తమ పశు వైద్యాధికారిగా చర్ల పల్లి గ్రామ డాక్టర్. వినయ్, ఉత్తమ గ్రామ కార్యదర్శిగా చర్లపల్లి గ్రామాని కి చెందిన నాసం అరుణ్ కుమార్, ఉత్తమ టెక్నికల్ అసిస్టెంట్ గా కుసు మ, ఉత్తమ బిఎల్ఓ గా ధర్మారం గ్రామానికి చెందిన చింతల అనిత.. లకు జిల్లా కలెక్టర్ ప్రశంస పత్రాలను అందజేశారు. అనంతరం పలువు రు అభినందనలు తెలిపారు.

