Breaking News

విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి..

  • కేసుపల్లి లో విషాద ఘటన.. మన ప్రగతి న్యూస్/ఏన్కూర్ :

విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన ఘటన ఏన్కూర్ మండలం కేసుపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసు కుంది. గ్రామానికి చెందిన కొలిశెట్టి సాంబ (28) విద్యుత్ షాక్‌ కు గురై మృతి చెందా రు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. తన వ్యవసాయ పొలం వద్ద పని చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న విద్యుత్ వైరు అతడికి తగలడంతో సాంబ తీవ్రంగా గాయపడి మృతి చెంది నట్లు వారు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘ టన ఎలా జరిగిందన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు