Breaking News

కరీంనగర్ లో ఘనంగా 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు

మన ప్రగతి న్యూస్//కరీంనగర్ జిల్లా స్థాపర్:

కరీంనగర్ పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా ఘనతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు.జిల్లా కలెక్టర్ పమేల సత్పతి జెండాను ఆవిష్కరించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఘనతంత్ర వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు,ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు,జర్నలిస్టులకు,విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది.భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ సారథ్యంలో రచించిన భారత రాజ్యాంగం 26 జనవరి 1950న అమలులోకి వచ్చింది.భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన అమరవీరులకు, రాజ్యాంగ వేత్తలకు,ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను. మన రాజ్యాంగంలో పొందుపర్చిన సూత్రాలకు,రాజ్యాంగ ఆదర్శాల సాకారానికి తోడ్పడడం పౌరులుగా మన కర్తవ్యం.మన రాజ్యాంగాన్ని ఆమోదించిన ఏడు దశాబ్దాల్లో భారతదేశం వివిధ రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించింది.గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారి దార్శనిక పాలనలో విద్యుత్, నీటిపారుదల,వ్యవసాయ,పరిశ్రమలు, ఉద్యోగ,ఉపాధి కల్పన,అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఐ.టీ నుంచి అగ్రికల్చర్ వరకు అన్నిరంగాల్లో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ అనతికాలంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నామని చెప్పడానికి సంతోషంగా ఉంది.ఈ సందర్భంగా మన జిల్లాలో అమలు చేస్తున్న వివిధ అభివృద్ది,సంక్షేమ కార్యక్రమాలను మీ ముందు ఉంచుతున్నాను.
మహాలక్ష్మి పథకం:మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నాం.239 బస్సుల ద్వారా ఈ పథకాన్ని వినియోగించుకున్న 6 కోట్ల 33 లక్షల మంది మహిళ ప్రయాణికులు 278 కోట్ల రూపాయల లబ్ధి పొందారు.గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే వినియోగదారులందరికీ జీరో బిల్లులు జారీ చేశాం.తద్వారా జిల్లాలోని ఒక లక్ష 71 వేల 622 సర్వీసులకు గాను 5 కోట్ల 26 లక్షల 12 వేల రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది.మహాలక్ష్మి పథకంలో భాగంగా ఒక లక్ష 56 వేల 83 మంది లబ్ధిదారులకు 5 లక్షల 32 వేల 66 సిలిండర్ లను 500 రూపాయలకే అందించడం జరిగింది. ఇందుకుగాను 16 కోట్ల 44 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది.
వ్యవసాయ శాఖ:ఈ శాఖ ద్వారా జిల్లాలో 79 వేల 541 మంది రైతులకు 622 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది.రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం సీజన్ ప్రారంభంలోనే ఒక లక్షా 90 వేలా 186 మంది రైతులకు 206 కోట్ల 62 లక్షల 96 వేల రూపాయలను ఖాతాల్లో జమ చేశాం. ఈ యాసంగి కోసం 41 వేలా 897 మెట్రిక్ టన్నుల యూరియా ఇప్పటికే సరఫరా సరఫరా చేయడం జరిగింది.రైతు బీమా ద్వారా మరణించిన రైతు కుటుంబాలకు 8 కోట్ల 80 లక్షల బీమా సొమ్మును అందజేసి ఆర్థిక చేయూత కల్పించాం.ఇందిరమ్మ ఇండ్లు:పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నాం.2024-25 సంవత్సరంలో ఇంటిస్థలాలు ఉన్న 11 వేల 575 మంది అర్హులకు ఇందిరమ్మ ఇండ్లనుకేటాయించాం. ఈ జనవరి నాటికి వివిధ దశలలో ఉన్న 6059 గృహాలకు 128 కోట్ల 88 లక్షల రూపాయలు లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది. పౌరసరఫరాల శాఖ:ఈ వానాకాలం సీజన్ లో 322 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3 లక్షల 33 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించాం.ఇందులో దొడ్డు రకం ధాన్యం ఒక లక్షా 90 వేల 720 మెట్రిక్‌ టన్నులు కాగా, సన్న రకం ధాన్యం ఒక లక్షా 42 వేల 346 మెట్రిక్‌ టన్నులు.ధాన్యం విక్రయించిన 63 వేల 830 మంది రైతులకు 795.67 కోట్ల రూపాయలను ఖాతాల్లో జమ చేయడం జరిగింది.జిల్లాలో 3 లక్షల 18 వేల 436 రేషన్ కార్డులకు ప్రతి నెలా 5 వేల 600 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం రేషన్ దూకాణాల ద్వారా పంపిణి చేస్తున్నాం.,వైద్య,ఆరోగ్య శాఖ:
గత సంవత్సర కాలంలో 6 వేల 453 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిల్లో జరిగాయి. అందులో 290 ప్రసవాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జరగడం విశేషం.ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా జిల్లాలోని మహిళలందరికీ 6 నెలలకు ఒకసారి సుమారు 40 వేల రూపాయల ఖరీదైన 54 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేయించడం లక్ష్యంగా పెట్టుకున్నాం.3 లక్షల 17 వేలా 541 మంది మహిళలకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి.ఒక లక్ష 9 వేల 548 మంది మహిళలు రెండవసారి ఆరోగ్య మహిళ సేవలను వినియోగించుకున్నారు.విద్యాశాఖ ప్రభుత్వ విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు జిల్లా యంత్రాంగం విభిన్న కార్యక్రమాలతో ముందుకెళ్తోంది. బ్రిక్స్‌ టు బుక్స్‌,విద్యా వాహిని,వాయిస్‌ ఫర్‌ గర్ల్స్‌,కాన్షియెనసెస్‌ క్లబ్స్‌,టెడ్‌ ఎడ్‌ టాక్స్‌, బుధవారం బోధన,ఇంగ్లీష్‌ క్లబ్‌,విటమిన్‌ గార్డెన్స్‌ వంటి వినూత్న కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలుపుతున్నాం.వలస కార్మికులు,కూలీల పిల్లలు చదువుకు దూరం కావద్దన్న సంకల్పంతో వారు పని చేసే సమీప పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం.వీరికి పుస్తకాలు, యూనిఫామ్,భోజన వసతి కల్పిస్తున్నాం. గత ఏడాది 600 మంది వలస కూలీల పిల్లలు ఈ పాఠశాలల్లో చదవగా ఈ ఏడాది 580 మంది చేరారు. జిల్లాలో 16 భవితా కేంద్రాలలో 341 మంది దివ్యాంగ విద్యార్థులకు బోధిస్తున్నాం.33 ప్రీ ప్రైమరీ స్కూళ్ల ద్వారా 645 మంది పిల్లలు పూర్వ ప్రాథమిక విద్య చదువుతున్నారు.ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి డెంటల్ విభాగం వైద్య అధికారులతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత డెంటల్ క్యాంపులు నిర్వహించి 21 వేల 581 మంది విద్యార్థులకు డెంటల్ పరీక్షలు నిర్వహించాం.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ: జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 634 స్వయం సహాయక సంఘాలకు 684 కోట్ల 61 లక్షల రూపాయల బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేశాం.11 వేల 401 సంఘాలకు 37 కోట్ల 81 లక్షల వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది.చేయూత పింఛను పథకం ద్వారా జిల్లాలో ఒక లక్ష 34 వేల 778 మందికి ప్రతినెల 31 కోట్ల 67 లక్షల రూపాయల పింఛను అందజేస్తున్నాం..పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా 771 స్వయం సహాయక సంఘాలకు 12 కోట్ల 17 లక్షల రూపాయల రుణాలను మంజూరు చేసాం.ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో 301 వ్యక్తిగత యూనిట్లకు 7 కోట్ల 78 లక్షల రూపాయలు మంజూరు చేశాం.37 గ్రూపు యూనిట్లకు 3 కోట్ల 11 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది..మహిళలు,పిల్లలు,దివ్యాంగులు,వయో వృద్ధుల శాఖ:జిల్లాలోని 777 అంగన్వాడి కేంద్రాల ద్వారా 53 వేల 532 మంది గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు సేవలు అందిస్తున్నాం.శుక్రవారం సభ ద్వారా ప్రతి గ్రామంలో మహిళలు, పిల్లల సంపూర్ణ అభివృద్ధికి,ఆరోగ్యానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా వారిలో రక్తహీనతను తగ్గించగలిగాం.స్నేహిత కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వేధింపులకు గురైతే నిర్భయంగా తెలిపేందుకు ప్రతి ఉన్నత పాఠశాలలో ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేశాం.మహిళా పోలీసుకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాం.మత్తు పదార్థాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం.జిల్లాలోని 328 పాఠశాలలు,కళాశాలల్లో కాన్షియస్నెస్ క్లబ్బులు ఏర్పాటు చేసి 28 వేల 690 మందికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం.కరీంనగర్ రీజనల్ స్పోర్ట్స్ స్కూల్ కు చెందిన 10 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో బంగారు పతకాలు, అథ్లెటిక్స్ పోటీల్లో 4 పతకాలు కైవసం చేసుకున్నారు.ఇటివలనే జిల్లా ఉన్నతాధికారులు,పొలీస్ యంత్రాంగం సమన్వయంతో గ్రామపంచాయితి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగింది. ఇందుకు జిల్లా యంత్రాంగం తరపున ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుచున్నాను.ఘనతంత్ర వేడుకల్లో పోలీసుల కవాతు, విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి.రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారికి,జిల్లా సర్వతోముఖాభివృద్దికి నిర్మాణాత్మక సహకారం,సూచనలు అందిస్తున్న గౌరవ మంత్రులకు,గౌరవ పార్లమెంటు సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు,గౌరవ శాసన సభ్యులకు,గౌరవ స్థానిక ప్రజా ప్రతినిధులకు,జిల్లా ఉన్నతాధికారులకు, పొలీస్‌ సిబ్బందికి, న్యాయాధికారులకు, ఉద్యోగులకు,స్వచ్చంధ సంస్థల ప్రతినిధులకు,స్వాతంత్య్ర సమరయోధులకు,జర్నలిస్టులకు,జిల్లా ప్రజలకు,ప్రతి ఒక్కరికీ జిల్లా కలెక్టర్ పమేల సత్పతి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఘనతంత్ర వేడుకల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం,అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే,లక్ష్మి కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, మరియు జిల్లా అధికారులు,ప్రజా ప్రతినిధులు,పోలీస్ అధికారులు,విద్యార్థులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు