మన ప్రగతి న్యూస్/జహీరాబాద్
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జహీరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించటం ఖాయమని, మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని కూడా సులభంగా కైవసం చేసుకోవచ్చని ఎమ్మెల్యే కె. మాణిక్ రావు తెలిపారు.
సోమవారం దత్తగిరి కాలనీలో యువ నేత మడూరి వేణుగోపాల్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాణిక్ రావు, డీసీఎంఎస్ మాజీ ఛైర్మన్ శివకుమార్ వారిని గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. సాగర సామాజిక వర్గం నుంచి యువకులు, నాయకులు భారీగా చేరినందుకు ఎమ్మెల్యే సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలనీ, వార్డు స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మహ్మద్ తంజీమ్, రేకుల్గి శుభాష్, విష్ణువర్ధన్, లక్ష్మీకాంతాచారి, శేఖర్, సంతోష్ సాగర్, వీరన్న పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


