మన ప్రగతి న్యూస్ /దమ్మపేట :
దమ్మపేట: ఫ్రెండ్స్ యూత్ అంకంపాలెం క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా సోమవారం ఫైనల్ మ్యాచ్ ను అంకంపాలెం వర్సెస్ తిరుమలకుంట మధ్య పోరా హోరీగా మ్యాచ్ జరగగా అంకంపాలెం టీమ్ ఫైనల్ విజేతగా గెలుపొందడం జరిగింది. రన్నర్ గా తిరుమలకుంట క్రీడాకారులు దక్కించుకోగా, మూడవ బహుమతి గొల్లగూడెం గ్రామ క్రీడాకారులకి, నాలుగవ బహుమతి గండుగులపల్లి టీంలు అందుకోవడం జరిగింది. ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అశ్వరావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ పాల్గొని క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి చేతుల మీదుగా బహుమతి ప్రధానోత్సవం చేయడం జరిగింది, మొదటి బహుమతి అంకంపాలెం టీం దక్కించుకోగా సభ్యులకు 50,116/- అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అందజేశారు. రెండవ బహుమతి తిరుమలకుంట క్రీడాకారులు 30,116/- కైవసం చేసుకోగా, దమ్మపేట మాజీ జడ్పిటిసి, జిల్లా సీనియర్ నాయకులు పైడి వెంకటేశ్వర్రావు విజేతలకు అందజేశారు, మూడవ బహుమతి 20,116/-గొల్లగూడెం టీమ్ దక్కించుకోగా మాజీ ఎమ్మెల్యే వెచ్చా నాగేశ్వరావు అందజేశారు, నాలుగవ బహుమతి 10,116/- అంకంపాలెం సర్పంచ్ మోకాళ్ళ గురుమూర్తి గండుగులపల్లి టీం కి అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి వర్యులు పైడి వెంకటేశ్వరరావు, దమ్మపేట తాసిల్దార్ రామ్ నరేష్, దమ్మపేట ఎస్సై సాయి కిషోర్ రెడ్డి, అంకంపాలెం సర్పంచ్ మోకాళ్ళ గురుమూర్తి, జగ్గారం సర్పంచ్ వంక జానకిరామ్, ఆర్లపెంట సర్పంచ్ మడకం కుమారి, పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీల, తిరుమలకుంట సర్పంచ్ రాజేష్, గండుగులపల్లి సర్పంచ్ మెచ్చు ఈదప్ప, పట్వారి గూడెం ఉపసర్పంచ్ బొల్లికొండ నాగేశ్వరరావు, ఆర్లపెంట ఉపసర్పంచ్ కట్టం సునంద ప్రసాద్, అంకంపాలెం మాజీ ఎంపీటీసీ సోడెం గంగరాజు, అంకంపాలెం మాజీ సర్పంచ్ కాకా అనూష భరత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఫ్రెండ్స్ యూత్ అంకంపాలెం క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు, కమిటీ సభ్యులు క్రీడాకారులు, క్రీడాభిమానులు, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ యూత్ అంకంపాలెం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

