మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని కనుముకుల గ్రామంలో గల శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఆలయ నిర్మాణ కర్త కోట మల్లారెడ్డి బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడైన కే.టి రామారావు కు మంగళవారం నాడు ఆహ్వాన పత్రం అందజేశా రు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గ్రామ ఉపసర్పం చ్ మహిపాల్ రెడ్డి, ఉత్సవ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్ .లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.

