Breaking News

రైతుల శ్రమదానంతో నల్లమాటు గండి పుడిచివేత

అభినందించిన మండల ప్రజలు

అధికారుల సహకారంతో రైతుల శ్రమదానం

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

నేటి తరానికి ఆదర్శం అంబేద్కర్.

మండలంలోని రంగాయ చెరువు సాగునీటి కాలువకు సంబంధించిన నల్లమాటు ప్రాంతంలో ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో తాగు నీరంతా వృధా పోవడాన్ని గమనించిన అన్నదాతలు మంగళవారం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించిన విషయం విధితమే.ఈ నేపథ్యంలో బుధవారం నల్లమాటు ఆయకట్ట రైతులు తమ సొంత ఖర్చులతో గండి పడిన చోట శ్రమదానంతో పూడ్చి వేసుకున్నారు. నల్లమాటు మరిన్ని సంవత్సరాలు పక్కాగా నిలిచి ఉండే విధంగా మత్తడిని నిర్మించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయకట్ట రైతులు మాట్లాడుతూ ఈ సమస్యపై అధికారులు దృష్టికి తీసుకు వెళ్లడంతో అధికారుల సహాయ సహకారాలతో గండి పడిన ప్రాంతాన్ని శ్రమదానంతో పూడ్చామని వారు పేర్కొన్నారు.యాసంగి పంట సాగయ్య సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నల్లమటుకు గండి పెట్టడం పట్ల అన్నదాతలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కున్నారని.
ఈ సమస్యను వారికి వారిగా రైతన్నలుపరిష్కరించుకునేందుకు శ్రమదానంతో నల్లమాటు గండిని పూడ్చడం అభినందనీయమని మండల ప్రజలు పేర్కొన్నారు. తమ శ్రమదానానికి సహకరించిన అన్ని పార్టీల నాయకులకు సంబంధిత శాఖ అధికారులకు రైతన్నలు కృతజ్ఞతలు తెలియజేశారు.