Breaking News

మద్ది మేడారం వనదేవతలకు పట్టు వస్త్రాలు సమర్పించిన అధికారులు, ట్రస్ట్ చైర్మన్

ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారి దురిశెట్టి నాగరాజు

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

మద్ది మేడారం జాతరలోని వ నదేవతలకు జాతర చైర్మన్ పబ్బు రాజేష్ – మీనా దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించడంతో స్థానిక తహసిల్దార్ ముప్పు కృష్ణ, ఇంచార్జ్ ఎంపీడీవో ఏ శ్రీనివాసరావు ల చేతుల మీదుగా వనదేవతలకు వస్త్రా అలంకరణ చేయించారు. దేవాలయ పూజారి నాగరాజు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుగా ధూప దీప నైవేద్యాలను వాన దేవతలకు సమర్పించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలుచోటుచేసుకోకుండా స్థానిక ఎస్సై వి గోవర్ధన్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తంగా సారలమ్మ గద్దె వద్దకు చేరుకోవడంతో అటు టేకుల మేడారం ఇటు మద్ది మేడారం భక్తుల రాకతో బుధవారం జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నాగరాజు పల్లె సర్పంచ్ ఎరుకల లలిత రఘు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి,మాజీ సొసైటీ డైరెక్టర్ చిట్యాల ఉపేందర్ రెడ్డి, టేకుల మేడారం జాతర చైర్మన్ కొట్టెం రాజ్ కుమార్, గోవిందాపూర్ సర్పంచ్ పాడ్య రజిత, మూడు చెక్కలపల్లి సర్పంచ్ సపావట్ కవిత ,దేవ్ సింగ్,రెండవ ఎస్ ఐ లక్ష్మారెడ్డి జాతర కమిటీ డైరెక్టర్లు వివిధ శాఖల అధికారులు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు పరిసర గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు.