మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
మండలంలోని మద్ది మేడారం జాతరలో బుధవారం రాత్రి 10 నాలుగు నిమిషాలకు గాంధీ నగర్ నుంచి సరళమ్మ బయలుదేరి గద్దల పైకి చేరుకున్నారు. స్థానిక ఎస్సై గోవర్ధన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు మధ్య సరళమ్మను గద్దెల పైకి తీసుకొని వచ్చారు. ఆలయ పూజారులు దుర్శట్టి నాగరాజు హరికృష్ణలు తమ స్వగ్రామమైన గుల్లపాడు శివారు గాంధీనగర్ నుంచి డప్పు చప్పుళ్ళు శివసత్తుల పూనకాల నడుమ సారలమ్మను మద్ది మేడారం జాతర గడ్డకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భక్తులు పూనకాలతో సారలమ్మను గద్దెకు చేర్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ముప్పు కృష్ణ, ఎంపీడీవో శ్రీనివాస్ శర్మ, ఆలయ ఏవో, ట్రస్ట్ చైర్మన్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.



