మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి:
మండలంలోని మద్ది మేడారం జాతరలో భక్తులు రాకతో జాతర ప్రాంగణం మొత్తం కిటకిట లాడింది. భక్తుల పూనకాలతో ..జాతర మొత్తం ఎడ్లబండ్లతో నిండిపోయింది. జాతర ప్రాంగణంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ కమిటీ సమన్వయంతో ఎప్పటికప్పుడు గ్రామపంచాయతీ సిబ్బందితో శుభ్రం చేయడం జరుగుతుంది.


