Breaking News

గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ.. నేడు సమ్మక్క తల్లి రాక..

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

డప్పు చప్పుళ్లు,శివసత్తుల,కోయల నృత్యాలు భక్తుల జయజయ ధ్వానాల నడుమ సారలమ్మ మేడారం గద్దెలపై కొలువుదీరింది.కేశవపట్నం శ్రీ సమ్మక్క సారక్క మహాజాతర బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది.సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే కార్యక్రమం ఉదయం ఆమె వెలసిన కన్నెపల్లి ఆలయం నుంచే ఆర్భాటంగా మొదలైంది.ఆలయాన్ని శుద్ధి చేసి ముగ్గులతో అలంకరించిన,అనంతరం పూజారులు సాయంత్రం ఏడుగంటల దాకా ప్రత్యేక పూజలు చేశారు.సారలమ్మ తల్లి రూపంలో ఆలయం నుంచి బయటకు వచ్చిన పూజారులు జనగం తిరుపతి గౌడ్, గోడిశాల శ్రీనివాస్ గౌడ్ లు భక్తుల మొక్కుల సమర్పణ నడుమ జాతర అమ్మవారి గద్దెల వరకి దండుగా కదిలారు.కిలోమీటర్ దూరం దారిపొడవునా భక్తులు బారులుతీరి హారతులిచ్చారు.బుధవారం రాత్రి 9:00 గంటలకు సారలమ్మ గద్దెకు చేరు కుంది.జాతర రెండో రోజు మరింత ప్రత్యేకం. సారలమ్మ గద్దెకు చేరుకోగా సమ్మక్క గురువారం గద్దెపైకి రానుంది.సమ్మక్క ఆగమనం కోసం ఉదయమే ఏర్పాట్లు మొదలవుతాయి.తొలుత వెంకయ్యగుట్ట లోని సమ్మక్క గుడిని శుద్ధి చేస్తారు.మామిడి తోరణాలు కడతారు. శక్తిపీఠాన్ని ఎర్రమన్నుతో అలికి ముగ్గులు వేస్తారు.పూజారులు అడవికి వెళ్లి వెదురు వనం,అడెరాలు తెచ్చి గద్దెపై నిలుపుతారు.ఆడెరాలను పసుపు, కుంకుమతో అలంకరిస్తారు. సాయంత్రం ప్రధాన పూజారులు తిరుపతి గౌడ్,శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో పూజారుల బృందం వెంకయ్యగుట్ట సమీపంలోకి వెళతారు.అక్కడి నుంచి గుట్టపైకి ప్రధాన పూజారులు వెళతారు.అక్కడ ఉన్న సమక్క రూపమైన కుంకుమ భరిణి,ఇతర పూజా సామగ్రిని శుద్ధి చేసి తిరుపతి గౌడ్,శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.ఈ పూజాతంతు అంతా గోప్యంగా జరుగుతుంది.పూజారులు సమ్మక్క తల్లి స్వరూపాన్ని తీసుకొని కిందకు వస్తున్నట్టు సంకేతం ఇస్తారు.తల్లిని తీసుకొని ఆయన కిందకు దిగగానే పూజారులు,అధికారులు,ప్రజలు సమ్మక్కకు స్వాగతం పలుకుతారు. పూజారులు సమ్మక్క తల్లితో కిందకు దిగిన తర్వాత అత్యంత వేగంగా అమ్మవారి గద్దెవైపు కదులుతారు.దారి పొడవునా భక్తులు బారులుతీరి నిల్చుంటారు.మంగళహారతులు పడతారు.గురువారం రాత్రి 9:00 లేదా 10:00 గంటల మధ్య సమ్మక్కను గద్దెపైకి పూజారులు తీసుకువచ్చేలా అధికార యంత్రాంగం ప్రయత్నాలు చేస్తోంది.సమ్మక్క గద్దెపైకి చేరుకోవడంతో జాతర మరోస్థాయికి చేరుతుంది.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు