Breaking News

లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి..

_ స్కానింగ్ కేంద్రాల పనితీరుపై పర్యవేక్షించాలి జిల్లా కలెక్టర్

_:ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యధిక ప్రసవాలు జరిగేలా కార్యాచరణ..

_ ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్..

మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్:

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

జిల్లా పరిధిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. స్కానింగ్ సెంటర్లు, నూతన ప్రైవేట్ దవాఖానలకు అనుమతుల జారీ, నవజాత శిశు మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సుదీర్ఘ సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షించాలని, బ్రూణ హత్యలు జర్గకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పీ సీ ఎన్ బీ యాక్ట్ సంబంధించి ఎప్పటికప్పుడు జిల్లా అడ్వైజర్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. బ్రూణ హత్యలతో మగ, ఆడ పిల్లల లింగ నిష్పత్తిపై ప్రభావం చూపుతుందని తెలిపారు
ఆడ అయినా.. మగ అయినా ఒకటేనని, ఇద్దరూ సమానమేనని స్పష్టం చేశారు. దీనిపై వైద్య ఆరోగ్య, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. స్కానింగ్ కేంద్రాల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లింగ నిర్దారణ పరీక్షలు చేస్తే పరిణామాలు, ఇతర అంశాలపై అవగాహన కల్పించేందుకు జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రుల రేడియాలజిస్ట్ లు, ల్యాబ్ టెక్నిషియన్లతో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు.జిల్లాలో నూతన ఆసుపత్రుల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిబంధనల ప్రకారం చేయాలని, ఆయా ఆసుపత్రులకు మున్సిపల్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య శాఖ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. అన్ని అనుమతులు ఉన్న వాటికి నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరు జారీ చేస్తామని తెలిపారు.
 
నవజాత మరణాల జరగకుండా చర్యలు
జిల్లాలో నవజాత మరణాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లాలో గత నాలుగు నెలల్లో జరిగిన నవజాత శిశువుల మరణాలపై సమీక్ష చేశారు. ఆయా శిశువుల తల్లి ఆరోగ్య పరిస్థితి, ఇంతకుముందు ఎందరు పిల్లలు ఉన్నారు. నవజాత శిశువుల మరణానికి కారణాలపై వివరాలు సేకరించారు. పిల్లల జననాల మధ్య కచ్చితంగా నిర్ణీత సమయం ఉండాలని, దీంతో తల్లి, పుట్టబోయే బిడ్డకు ఎంతో మేలని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో అవగాహన కల్పించాలని సూచించారు. నవజాత పిల్లల సంరక్షణ, పాలు పట్టించడం, మిగితా అంశాలపై బాలింతలు, కుటుంబ సభ్యులకు వివరించాలని తెలిపారు.
 
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి..

ప్రభుత్వ ఆసుపత్రులలో సేవలపై విస్తృత అవగాహన కల్పించాలని, అత్యధికంగా ప్రసవాలు జరిగేలా తీసుకోవాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహిం చాలని, అత్యవసరమైన పక్షంలోనే సీ సెక్షన్ ఆపరేషన్లు చేయాలని ఇంచార్జి కలెక్టర్ సూచించారు.గర్భిణులపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, నిరంతరం వారి ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ కొనసాగిం చాలని ఆదేశించారు.గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువుల మరణాలు జిల్లాలో జరగకూడదని పేర్కొన్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్లు, డాక్టర్లు, ఆశ కార్యకర్తలు నిత్యం గర్భిణులతో మాట్లాడాలని వారి కుటుంబ ఆరోగ్య చరిత్ర ఇతర వివరాలు అందుబాటులో ఉండాలని సూచించారు.సమీక్ష సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్, వేములవాడ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్, డీఎస్పీ నాగేంద్రాచారి, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరెడ్డి, ఐఎంఏ ప్రెసిడెంట్ శోభారాణి, ఎన్జీఓ ప్రతినిధి భాస్కర్, ఆయా మండలాల వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.