Breaking News

మద్ది మేడారంలో సమ్మక్క సారక్క ను దర్శించుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి

మండలంలోని మద్ది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దర్శించుకున్నారు. మద్ది మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి ఎమ్మెల్యే నర్సంపేట కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో తరలివచ్చారు. గద్దెపై కొలువు తీరిన అమ్మవార్లకు ఎమ్మెల్యే మొక్కలను చెల్లించుకున్నారు. మొదట సమ్మక్క అమ్మవారిని దర్శించుకుని అనంతరం సారలమ్మ వారిని దర్శించుకున్నారు .అక్కడే కొలువై ఉన్న గోవిందరాజు, పగిడిగిద్దె రాజులను ఎమ్మెల్యే దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ఎమ్మెల్యే చీరేసారని సమర్పించారు .వనదేవతల గద్దెల వద్ద ఆలయ పూజారి దురిశెట్టి నాగరాజు ప్రత్యేక పూజలు పూజలు నిర్వహించారు. అనంతరం జాతరకు సంబంధించిన సౌకర్యాల గురించి నిర్వాహకులతో చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ పబ్బు రాజేష్, వ్యవసాయ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ఎమ్మార్వో, ఎంపీడీవో, ఆలయ ఏవో, పోలీస్ సిబ్బంది, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు