మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్,ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి,రజిని సాయి చందు సాదరంగా ఆహ్వానించారు
మన ప్రగతి న్యూస్/ఆమనగల్లు:
మున్సిపాలిటీ కి చెందిన ప్రముఖ సంఘ సేవకుడు పాపిశెట్టి రాము.గత 35సం,, లుగా రాజకీయాలకు అతీతంగా కల్వకుర్తి నియోజకవర్గంలో అనేక ప్రజా సేవలు,విద్యా రంగంలో,పేద ప్రజలను ఆదుకుంటూ ముందుకు సాగుతున్నారు.అలాంటి పాపిశెట్టి రాము గురువారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గుర్క జైపాల్ యాదవ్,మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.దీంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేశారు.ఈ కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపాలిటీ ఇంచార్జి రజిని సాయి చందు,మున్సిపాలిటీ అధ్యక్షులు పత్య నాయక్, సింగిల్ విండో వైస్ చైర్మన్ గంప వెంకటేష్, నాయకులు,కార్యకర్తలు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

