Breaking News

కాంగ్రెస్ పార్టీలో చేరిన 12వ వార్డు రాజనగరం బిఆరెస్ నాయకులు

మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి :

వనపర్తి మున్సిపాలిటీ 12వ వార్డు రాజనగరం, వడ్డే వాడకు చెందిన పలువురు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శుక్రవారం నంది హిల్స్ ఎమ్మెల్యే కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు.12వ వార్డు రాజనగరం వడ్డేవాడకు చెందిన 50 మంది బిఆరెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు రాజనగరంకు చెందిన కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువాలను కపి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజానగరం త్వరితగతిన అభివృద్ధి చెందుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన, సంక్షేమ పథకాలను ఆకర్షించి నేడు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు బిఆరెస్ నాయకులు, కార్యకర్తలు పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నక్క రాణి నక్కరాజు ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో 12వ వార్డు రాజనగరం కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మాజీ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

పెండింగ్ బిల్లులు చెల్లించాలి..