Breaking News

ఇంటలిజెన్స్ అధికారి నారాయణ మృతి పట్ల ఎస్పీ సంతాపం

కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేత

మన ప్రగతి న్యూస్/జహీరాబాద్

పెండింగ్ బిల్లులు చెల్లించాలి..

న్యాల్ కల్, ఝరాసంఘం మండలాలకు చెందిన ఇంటలిజెన్స్ (పోలీస్ విభాగం ఐబి) క్షేత్రస్థాయి అధికారి అధికారి సీహెచ్ నారాయణ మృతి చెందడం పట్ల హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పి కరుణాకర్, హైదరాబాద్ జోన్ ఆర్ఐఓ తిరుపతి, జహీరాబాద్ డిఎస్పి సైదా నాయక్, జహీరాబాద్ పట్టణ, గ్రామీణ సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, తదితరులు తరలివచ్చి శుక్రవారం సంతాపం తెలుపుతూ నివాళులర్పించారు. గురువారం రాత్రి హృదయ సంబంధిత (గుండెపోటు) అనారోగ్యంతో ఇంటలిజెన్స్ అధికారి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న ఇంటలిజెన్స్ ఎస్పి, సిబ్బంది జహీరాబాద్ పట్టణంలోని చెన్నారెడ్డి కాలనీలోని మృతుడు సిహెచ్ నారాయణ స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. న్యాల్ కల్ మండలం, చీకూర్తి గ్రామ వాస్తవ్యులైన నారాయణ ఇంటెలిజెన్స్ అధికారిగా విధులు నిర్వహిస్తూ.. జహీరాబాద్ లోని చెన్నారెడ్డి కాలనీలో నివాసముంటున్నారు. మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న చీకూర్తి గ్రామస్తులతో పాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు.