పార్టీ సిద్ధాంతాలకు గౌరవించి మున్సిపల్ కౌన్సిలర్ నామినేషన్ వేయలేదు
మాజీ జెడ్పిటిసి, సీనియర్ నాయకులు షేక్ గయాజుద్దీన్
మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డి:
తన తండ్రి నడిపిన బాటలో… నిస్వార్ధ రాజకీయంతో ఎల్లారెడ్డి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ గయాజుద్దీన్ తెలిపారు.ఎల్లారెడ్డిమున్సిపల్ కౌన్సిలర్ బరిలో ఉంటే తప్పకుండా విజయం సాధిస్తారని అన్ని సర్వేలు ,ఇంటెలిజెన్స్ రిపోర్టులు , ప్రజల మద్దతు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలుతెలియజేశారు..కానీ కొన్ని రాజకీయాల వల్ల, అనివార్య కారణాలతో తనకు బీఫామ్ ఇవ్వకపోవడం నిరాశకు గురి చేసిందని తెలిపారు.అందుకే మున్సిపల్ కౌన్సిలర్ గా నామినేషన్ వేయలేదని తెలిపారు.దీంతో ఎల్లారెడ్డి ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉండడం బాధగా ఉంది. దయచేసి నన్ను ప్రాణ సమానంగా చూసుకునే నా ఎల్లారెడ్డి ప్రజలు, కార్యకర్తలు, సన్నిహితులు,శ్రేయోభిలాషులు ఎవరు కూడా అధర్యపడకూడదని , ఎలాంటి ఆందోళనకు గురికాడుకూడదని తెలిపారు. పదవి ఉన్నా లేకపోయినా 24 గంటలు మీకు అందుబాటులో ఉంటానని చెప్పారు. పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి ఎలాంటి స్వార్థం లేకుండా, ప్రతి ఎన్నికల్లో చెమటోడ్చి పార్టీ గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన సీనియర్ నాయకునికి తగిన గుర్తింపు ఇవ్వలేదని తెలిపారు.

