మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
శంకరపట్నం మండలం కేశవపట్నం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీ నాయకులతో కలిసి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి,మొక్కులు చెల్లించుకున్నారు.జాతర కమిటీ అధ్యక్షుడు గుర్రం స్వామి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు, ఎమ్మార్వో సురేఖ, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్,గ్రామ సర్పంచ్ రాజేంద్రప్రసాద్ పార్టీ నాయకులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ ను సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వనదేవతలను మొక్కులు చెల్లించుకుంటే కొంగుబంగారమవుతుందని అన్నారు. జాతరలో అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం,జాతర కమిటీ సభ్యులు పర్యవేక్షించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పాలకవర్గం, ఆలయ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షుడు గోపగొని బసవయ్య గౌడ్,పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

