సంక్షేమ–అభివృద్ధి పనులతో ఆకర్షిస్తున్న కాంగ్రెస్
మన ప్రగతి న్యూస్/వేములవాడ
వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి వలసలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.ఉమ్మడి మానాల పరిధిలోని రుద్రంగి మండలం బడి తండా, రూప్లా నాయక్ తండా, జ్యోద్యా తండా, సర్పంచ్ తండా, దేగావత్ తండాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈసందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,తండాల సమగ్ర అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, ఉపాధి వంటి రంగాల్లో తండాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై నమ్మకంతో ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారని, ఇది కాంగ్రెస్ బలాన్ని మరింత పెంచుతోందని ఆయన పేర్కొన్నారు.

