Breaking News

భీమేశ్వరాలయ ఆవరణలో యాచక వృద్ధులకు కౌన్సిలింగ్ – వయోవృద్ధుల సంక్షేమ కేంద్రానికి తరలింపు

మన ప్రగతి న్యూస్/ వేములవాడ

వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ ఆవరణలో యాచక వృత్తిలో జీవనం సాగిస్తున్న వృద్ధులకు జిల్లా శిశు సంరక్షణ అధికారి కవిత నేతృత్వంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. వృద్ధుల పరిస్థితిని పరిశీలించిన అధికారులు, వారికి అవసరమైన సహాయంపై అవగాహన కల్పించారు.అనంతరం ఆయా వృద్ధులను మండేపల్లిలోని వయోవృద్ధుల సంక్షేమ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా డీసీపీఓ కవిత మాట్లాడుతూ, వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.వేములవాడ అర్బన్ కాలనీకి చెందిన తోట భూదవ్వ, తోట రాజవ్వలను వయోవృద్ధుల సంక్షేమ సంఘానికి తరలించినట్లు ఆమె తెలిపారు. సమాజంలో నిరాధారంగా ఉన్న వృద్ధులకు తగిన సంరక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి