Breaking News

అస్వస్థ విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి – ఎమ్మెల్యే రాందాస్ నాయక్

మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్:

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియ తండా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంతో 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసిన అనంతరం విద్యార్థులకు వాంతులు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించడంతో పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి వారిని చికిత్స నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆసుపత్రికి చేరుకుని అస్వస్థతకు గురైన విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన ఆయన, పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి