Breaking News

తాటిచెట్టు పై పడి గీత కార్మికుడికి గాయాలు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

తాటిచెట్టు పై పడి ఓ గీత కార్మికుడికి గాయాలయ్యాయి.ఈ విషాదకర సంఘటన శంకరపట్నం మండలం ఆముదాలపల్లి లో చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన బొడిగె రవీందర్ గీత కార్మికుడు,వృత్తినిర్వహణలో తాడిచెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు.గమనించిన తోటి గీత కార్మికులు,కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో జమ్మికుంట ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.నిరుపేద కుటుంబానికి చెందిన రవీందర్ ను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు,గౌడ కులస్థులు కోరుతున్నారు.

నేటి తరానికి ఆదర్శం అంబేద్కర్.