Breaking News

సురక్షిత గ్రామంపై అవగాహన సదస్సు—పాల్గొన్న సర్పంచ్ బండారి మహేందర్,ఉపసర్పంచ్ బాలామణి మల్లేష్ యాదవ్

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:

బీబీనగర్ మండల పరిధిలోని జమీలాపేట పరిషత్ ఉన్నత పాఠశాల మరియు గ్రామ పంచాయితీ కార్యాలయంలో సురక్షిత గ్రామంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గో ఇండియా ట్రస్ట్ సిబ్బంది పిల్లలు,తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు,బాల కార్మికులు,మానవ అక్రమ రవాణా,ప్రేమ ప్రలోభాలతో మిస్సింగ్ కేసులు,కిడ్నాప్ కేసులు,గంజాయి వంటి చెడు అలవాట్లు,అవయవ దోపిడి,ఫేక్ కేసులు,గృహహింస వంటి ఘటనలు పెరుగుతున్నాయని వివరించారు.ఈ ఘటనల వల్ల బాలికలను,మహిళలను అక్రమ రవాణా చేసి వ్యభిచార గృహాలకు అమ్ముతున్నారని,బాలురను కర్మాగారాల్లో బాల కార్మికులుగా మారుస్తున్నారని తెలిపారు.ఈ ప్రమాదాలకు బయటి వ్యక్తులే కాకుండా,తెలిసిన వారే నమ్మించి మోసం చేస్తున్నారని పేర్కొన్నారు.కావున ప్రతి గ్రామంలో తల్లిదండ్రులు,బాలురు,బాలికలు తగిన అవగాహన కలిగి ఉండాలని సూచించారు.బాల్య వివాహాలు,మానవ అక్రమ రవాణా లేని గ్రామాలే నిజమైన సురక్షిత గ్రామాలు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో మై ఛాయిస్ ఫౌండేషన్ సహకారంతో విద్యార్థులకు ఉచితంగా కామిక్ బుక్స్ అందజేశారు.అత్యవసర పరిస్థితుల్లో 100,1098,181, 1800-419-8588 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జ్,సర్పంచ్ బండారి మహేందర్,ఉప సర్పంచ్ తిప్పరబోయిన బాలమణి మల్లేష్ యాదవ్,వార్డ్ సభ్యులు గడ్డం అరుణ,గోపాలరాజు,బండారు సురేష్,మాజీ ఉపసర్పంచ్ శ్రీకాంత్ యాదవ్,మాజీ ఉప సర్పంచ్ నాగరాజు గౌడ్,గ్రామ పెద్దలు,గ్రామ కార్యదర్శి,గో ఇండియా ట్రస్ట్ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి