Breaking News

కేంద్రం తెలంగాణ కు అన్యాయం చేసింది

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..

పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి , డీసీసీ అధ్యక్షులు ఆయుభ్ ,అశోక్ గౌడ్ లతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న
మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా మాట్లాడుతూ
తెలంగాణ పై కేంద్ర బడ్జెట్ లో మరోసారి మొండి చేయి చూపింది.. మేము అడిగినవి ఏ ఒక్కటి మాకు ఇవ్వలేదు..
తెలంగాణ ప్రజలందరూ ఈ బడ్జెట్ లో అయిన కేంద్రం వివక్షపూరితంగా కాకుండా క్రమశిక్షణ తో న్యాయబద్ధంగా కేటాయిస్తారని ఆశగా ఎదురు చూసాం.తెలంగాణ పట్ల కేంద్రం మరోసారి వివక్ష చూపింది.గత ఏడాది కేంద్రం తెలంగాణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిచినప్పుడు శాసన సభ వేదికగా కేంద్రం ను నిలదీయడం జరిగింది.
రాష్ట్రానికి కావలసిన అంశాలపై ముఖ్యమంత్రి మంత్రులు ప్రధాన మంత్రి,కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది.తమిళనాడు మాదిరి ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐక్యంగా ఉద్యమించాలని కోరాం..
తెలంగాణ ప్రోగ్రెసివ్ గ్రోత్ ఉన్న రాష్ట్రం.. దేశం లో 29 రాష్ట్రాల్లో తెలంగాణ లో పార్టీలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధికి 2047 తో ముందుకు పోతున్నాం..
హైదరాబాద్ అన్ని రకాల వాతావరణలకు అనుగుణంగా ఉపాధి అవకాశాలు భూగర్భ వనరులు , ప్రకృతి అంశాలు..ఐటీ రంగం దేశంలోనే నెంబర్ వన్ హైదరాబాద్ విస్తరణ పెరుగుతున్నప్పుడు కోర్ అర్బన్ విస్తరిస్తున్నప్పుడు.. రీజనల్ రింగ్ రోడ్డు అడిగాం.. రింగ్ రోడ్డు కి రీజనల్ రింగ్ రోడ్డు కి మధ్య రోడ్ల అభివృద్ధి అడిగాం మొండి చేయి చూపింది.మూసి అభివృద్ధికి నిధులు అడిగాం.ఆంధ్రప్రదేశ్ కి నిధులు అడగడం పట్ల ఎందుకు ఇచ్చారని మేము అడగడం లేదు.. ఆ ప్రభుత్వం మీదనే మోడీ ప్రభుత్వం ఉంది.మాది చిన్న వయసు గల రాష్ట్రం..గత 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం కేంద్రంతో సయోధ్య లేకుండా మాకు రావాల్సినవి అడగలేకపోయింది.మేము అలా కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాన మంత్రి దృష్టికి తీసుకుపోయినా వివక్ష చూపిస్తున్నారు.ప్రతిపక్ష పార్టీల విమర్శిస్తున్న ప్రధాన మంత్రి ,కేంద్ర మంత్రులను మా ముఖ్యమంత్రి తెలంగాణ ప్రయోజనాల కోసం కలుస్తున్న తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నారు.
ప్రపంచంలో ప్రతి కార్యక్రమానికి హాజరయ్యే వ్యక్తి కుంభమేళ లాంటి మేడారం జాతర కు ఎందుకు రాలేదు.తెలంగాణ ప్రజల ఆకాంక్ష తల్లిని చంపి బిడ్డను ఇచ్చారని మమల్ని అవమానించారు..బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు.కేంద్రం తెలంగాణ కి ఇచ్చిన మొండి చేయి పై గతంలో ఉద్యమంలో మాదిరి సకల జనులు అప్రమత్తంగా ఉండాలి.తెలంగాణ నుండి 8 మంది ఎంపీలు ఉన్నారు..
తెలంగాణ ప్రభుత్వం దేవాలయ అభివృద్ధి కి జాతర కి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది..
మేడారం జాతర కి 4 వేల బస్సులు నడిపింది.. ప్రత్యేకంగా బస్సులకు కేటాయించిన రూట్లలో అనేక వాహనాలు వచ్చాయి..
మా ఆర్టీసీ డ్రైవర్లకు ,కండక్టర్లకు సెల్యూట్ చేస్తున్న.. విమర్శలు పట్టించుకోవద్దు.50 వేల బారికేడ్లు వేశాం..నిరంతరం మా సిబ్బంది శ్రమించారు.
మా సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎక్కడ ఇబ్బందులు జరగలేదు.. మా పొరపాటు ఎక్కడ లేదు.జాతర కోసం నిరంతరం శ్రమించిన మా సిబ్బంది కి అభినందనలు..
మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 మున్సిపాలిటీ లు ఉన్నాయి.. నేను ఈ పార్లమెంట్ కి మున్సిపల్ ఎన్నికలకు సమన్వయకర్త గా ఇక్కడికి వచ్చాను..
మహబూబాబాద్ లో ఉన్న 156 స్థానాలు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం .. ఈ మున్సిపాలిటీ లు అన్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ప్రాతినిద్యం వహిస్తున్న స్థానాలు..ఈ ఏడు మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం..
గత 10 సంవత్సరాలుగా ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు రాలేదు..మేము నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం..రేషన్ కార్డులు ,సన్న బియ్యం,200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్, రైతు భరోసా, రైతు రుణమాఫీ, మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నాం.నర్సంపేట మున్సిపాలిటీ లో ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది..వారికి బిఫార్మ్స్ అందించి గ్రౌండ్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు.అర్బన్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించి ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నాం.. రోడ్లు ,డ్రైనేజీ ,ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ప్రత్యేక కార్యాచరణ తీసుకున్నామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.