Breaking News

ఫర్టిలైజర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా నాగుర్ల..

  • శుభాకాంక్షలు తెలిపిన వరికెల కిషన్ రావు..

మన ప్రగతి న్యూస్/నడికూడ:

ఫర్టిలైజర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్య క్షుడిగా ఎన్నికైన నాగుర్ల వెంకటేశ్వర్లు కు రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు నాణ్య మైన ఎరువులు, విత్తనాలు అందించ డంలో ఫర్టిలైజర్ షాప్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాంటి బాధ్యతా యుతమైన పదవికి నాగుర్ల వెంకటేశ్వర్లు ఎన్నికవడం రైతు సమాజానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొ న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను గుర్తించి, పరిష్కార దిశగా ఆయన సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫర్టిలైజర్స్ రంగంలో ఉన్న అనుభవం, సేవాభావం, నాయకత్వ లక్షణాలతో నాగుర్ల ఈ పదవికి న్యాయం చేస్తారని తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ విశ్వాసం వ్యక్తం చేస్తుంది. భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కిషన్ రావు కోరారు.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..