Breaking News

మున్సిపల్ ఎన్నికల దృశ్య ప్రజావాణి కార్యక్రమం రద్దు

_ ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్…

మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల,:

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..

రాజన్న సిరిసిల్ల జిల్లా : సమీకృత కార్యాలయాల సముదాయంలో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుండి వినతులను స్వీకరించే ప్రజావాణి కార్యక్రమాన్ని మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం రద్దయిన విషయాన్ని జిల్లా ప్రజలు గమనించాలని సూచించారు. ఎన్నికల కోడ్ ముగిసేంతవరకు ప్రజావాణి కార్యక్రమము ఉండదని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ స్పష్టం చేశారు…