మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
రెండు సంవత్సరాలుగా నీటి ఎద్దడితో అలమటిస్తున్న స్పెషల్ ఆఫీసర్ కి, పంచాయతీ కార్యదర్శి కి తెలిపిన పట్టించుకోలేదని కాలనీవాసులు తెలిపారు.శంకరపట్నం మండలం మెట్పల్లి లో 7వ,8వ వార్డు కాలనీవాసులకు బోరు బావి మరమ్మత్తులు చేపించాలని సర్పంచ్ కొయ్యడ కుమార్ యాదవ్ ను సంప్రదించారు. ఆదివారం సర్పంచ్ 7వ,8వ వార్డ్ ప్రజల సౌకర్యార్థం మరమ్మత్తులు చేపించారు.బోరు బావి బాగు చేయించడంతో గ్రామ సర్పంచ్ కి కాలనీవాసులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

