Breaking News

వీధి కుక్కల దాడిలో గొర్రెల మృతి.

మన ప్రగతి న్యూస్ / గుండాల:
వీధి కుక్కల స్వైర విహారంతో గొర్రెలు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రైతుదేవన బోయిన సోమ నర్సయ్య గొర్రెలదొడ్డి గ్రామ సమయంలో ఉండగా అందులో కుక్కలు దూరి 12 గొర్రెలను కొరికి వేశాయి. సంఘటన స్థలాన్ని స్థానిక సర్పంచ్ దేవన బోయిన ఐలయ్య, ఉప సర్పంచ్ ఆవుల సాయిప్రసాద్, వార్డు సభ్యులు పి ఉపేందర్ పరిశీలించారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా