మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
టీవీఎస్ ఎక్సెల్ బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శంకరపట్నం మండలం కాచాపూర్ గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి (50) తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం కేశవపట్నం వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఆల్ఫ్రెడ్ నోబెల్ స్కూల్ ఎదురుగా అదుపుతప్పి పడిపోయాడు.ఈ ప్రమాదంలో శ్రీనివాసరెడ్డి తలకు బలమైన గాయమైంది. గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించ డంతో సంఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది ఈఎంటి సతీష్ రెడ్డి,పైలెట్ ఖాజా ఖలీల్ ప్రథమ చికిత్స అందిస్తూ హుజురాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

