మన ప్రగతి న్యూస్/వేములవాడ:
వేములవాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. పట్టణంలోని 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తోటరాజు సోమవారం ఉదయం నుంచి అదృశ్యమయ్యారు. ఉదయం ఇంట్లో టిఫిన్ చేసి బయటకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళ నకు గురయ్యారు. తోటరాజు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 4వ వార్డు టికెట్ మరొకరికి కేటాయించడంతో కొందరు అసంతృప్తికి లోనైన అభ్యర్థులు మనస్తాపానికి గురై ఈ అదృశ్యానికి కారణమై ఉండొచ్చని స్థానికంగా చర్చ సాగుతోంది. ఈఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.తోటరాజు చివరిసారిగా ఎక్కడికి వెళ్లారు, ఎవరితో మాట్లాడారు అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీతో పాటు కాల్ డేటా ఆధారంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఎన్నికల వేళ ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తోట రాజు క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆకాంక్షిస్తున్నారు.

