మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
కరీంనగర్ పట్టణంలో ఆల్ఫోర్స్ హైస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శంకరపట్నం మండలం మొలంగుర్ మహమ్మద్ ముఫాజీల్ అహ్మద్ ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ లో జరిగిన సీనియర్ నేషనల్ రాకెట్ బాల్ ఛాంపియన్షిప్లో ప్రతిభ కనపరచడంతో రాకెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రెటరీ అయ్యప్పన్ గోపాలకృష్ణ ఏషియన్ క్రీడల్లో సెలెక్ట్ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర రాకెట్బాల్ అధ్యక్షుడు బొంతల ప్రవీణ్ కుమార్ తెలిపారు.ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి మహమ్మద్ ముఫాజీల్ అహ్మద్ ను అభినందనలు తెలిపారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ మహమ్మద్ ముఫాజీల్ అహ్మద్ భూటాన్ దేశం ఖాట్మండు లో మే నెలలో ఫస్ట్ ఏషియన్ క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిచి విజయకేతనంతో రావాలని ఆకాంక్షించారు.

