Breaking News

శోభయమానంగా స్వామివారి పుష్ప యాగం

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో స్వయంభు వెలసిన శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయక్షేత్రంలో సోమవారం నీలాదేవి భూదేవి సహిత శ్రీ మత్స్య గిరింద్ర స్వామి పుష్పయాగం వైభవంగా జరిగింది. ఆలయ పరిధిలోని కోనేరులో స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో అర్చకులు శేషం మురళీధరచార్యులు, మాధవాచార్యులు వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పుష్పార్చన నిర్వహించారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో సుధాకర్,ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి