Breaking News

వనదేవతల హుండీ లెక్కింపు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

శంకరపట్నం మండలం కేశవపట్నం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర జనవరి 28 నుండి 31 తేదీ వరకు అమ్మవార్లను దర్శించుకోవడానికి పలుజిల్లాల,ప్రాంతాల నుండి భక్తులు వేల సంఖ్యలో వనదేవతలకు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.జాతర ముగియడంతో జాతరలోని 12 హుండీలను అధికారుల పర్యవేక్షణతో కేశవపట్నం పోలీస్ స్టేషన్లో భద్రపరిచారు.కేశవపట్నం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర హుండీలను మంగళవారం వెలుగు బాట మండల సమైక్య కార్యాలయంలో పోలీస్ బందోబస్తుతో 12 హుండీలను తహాశీల్దార్ సురేఖ,ఎంపీడీవో కృష్ణ ప్రసాద్,గ్రామ సర్పంచ్ రాజేంద్రప్రసాద్,కార్య నిర్వహణ అధికారి మారుతీరావు,జాతర కమిటీ అధ్యక్షుడు గుర్రం స్వామి,పూజారులు కొబ్బరికాయలు కొట్టి అందరి సమక్షంలో హుండీలను తెరిచారు. శ్రీ వెంకటేశ్వర 4 రోజులకు వనదేవతల జాతర కు భక్తులు కానుకల రూపంలో సమర్పించిన ఆదాయం రూ.9.25 లక్షల ఆదాయం వచ్చినట్లు కార్య నిర్వహణ అధికారి మారుతిరావు తెలిపారు.ఆయన మాట్లాడుతూ జాతరలో వేలంతో,ప్రత్యేక దర్శనం,కేశఖండనం మొక్కుబడులతో రూ. 6.68 లక్షలు వచ్చినట్లు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సేవకుల ఆధ్వర్యంలో జాతరలో నాలుగు రోజుల మొత్తం హుండీ ఆదాయాన్ని లెక్కింపగా,రూ. 15.93 లక్షలు వచ్చినట్లు తెలిపారు.గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం దాదాపు రూ.6.85 లక్షలు వచ్చినట్లు జాతర కమిటీ అధ్యక్షుడు గుర్రం స్వామి తెలిపారు.

బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు