- పురవీధులలో అమ్మవారి రథం ఊరేగింపు
మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
మున్సిపల్, మండల కేంద్రమైన భూదాన్ పోచంపల్లిలో మంగళవారం నాడు మ హమ్మాయమ్మ జాతర మహా వైభవంగా జరిగింది. మహమ్మాయి దేవి- పరమేశ్వ ర స్వామి కళ్యాణ రథోత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం నాడు అ మ్మవారి రథోత్సవం- జాతర వైభవంగా జరిగింది. రంగు-రంగుల పువ్వులతో శో భాయ మయంగా అలంకరింపజేసిన రథంలో అమ్మవారి -స్వామివారి ఉత్సవ వి గ్రహాలను ఆదిష్టింపజేశారు.డప్పు వాయిద్యాలు- సన్నాయి మేళాల చప్పుళ్లతో అ మ్మవారి రథాన్ని పట్టణ పురవీధులలో ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఊ రేగింపబడింది. భక్తజనులు మంగళహారతులతో స్వాగతించారు. ఉదయం ఆల యంలో దిష్టి కుటుంబం చేయబడింది.మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నవగ్రహాలకు , వీరబ్రహ్మేంద్ర -నాగేంద్ర స్వాములకు ప్రత్యేక పూజ లు గావించారు. సాయంత్రం ఆలయంలో జరిగిన చక్రవర్తి సేవా కార్యక్రమానికి భక్త జనులు అధికంగా పాల్గొని అమ్మవారికి టెంకాయలు, కట్నాలు మర్పించి, దీపరా జ్యం చేశారు.ఈ కార్యక్రమాల్లో చేపూరి రామ్మోహన్ చారి ,ఎన్.కిష్టయ్య, కృష్ణమా చారి, రాఘవేంద్ర, చేపూరి రాజు, కిష్టోజు ప్రభాకర్ ,దేవరకొండ ఆనంద్, ఏ. స్వా మి ,ఎన్.రామ కృష్ణ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ,వివిధ భజన మండలి వారు, భక్తజనులు అధికంగా పాల్గొన్నారు.

