మన ప్రగతి న్యూస్/ సూర్యాపేట /జిల్లా స్టాపర్
ఈనెల 11వ తారీఖున జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో భద్రత భరోసా నమ్మకం కల్పించడం ఎన్నికల నియమాలను పటిష్టంగా అమలు చేయడం ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కుడకుడ గ్రామంలో సబ్ డివిజన్ పోలీసులు అధ్వర్యంలో భారీ పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ కార్యక్రమం నందు డివిజన్ డిఎస్పి ప్రసన్నకుమార్ పట్టణ రూరల్ ఇన్స్పెక్టర్లు వెంకటయ్య రాజశేఖర్ పాల్గొన్నారు. మున్సిపాలిటీలో ప్రధాన రహదారులు, సమస్యాత్మక ప్రాంతాలు, జనసాంద్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల మీదుగా ఫ్లాగ్ మార్చ్ కొనసాగింది.ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేసినా, అసాంఘిక శక్తులు తలదూర్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధిలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు, ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడు 24/7అందుబాటులో ఉంటుందని, ప్రజల రక్షణే తమ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో ఎన్నికలు విజయవంతం అయ్యేలా సహకరించాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది..ఈ కార్యక్రమం నందు సూర్యాపేట సర్కిల్ ఎస్సైలు సూర్యాపేట పట్టణ ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.
