Breaking News

వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్మన ప్రగతి న్యూస్ / వర్ధన్నపేట : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు వర్ధన్నపేట ఏసిపి అంబటి నరసయ్య ఆధ్వర్యంలో శనివారం రోజున వర్ధన్నపేట మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో పోలీసులు ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ ఉమ్మడి నరసయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ప్లాగ్ మార్చ్ నిర్వహించామని తెలిపారు. పట్టణ ప్రజలు శాంతిభద్రతలకు విఘాతం కలుగ చెయ్యకుండా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించే లాగా సహకరించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట ఎస్ఐలు సాయిబాబా, రాజు, జఫర్గడ్ ఎస్సై రామారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్సి కాలనీని అభివృద్ధి చేసింది కెసిఆర్ ప్రభుత్వమే

యువకులకు దళిత బందు ఇచ్చి యువకులకు అభివృద్ధి బాట వేసిండ్రు

యువకులకు కౌన్సిల్ లో పెద్ద పీట

ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే ఆల

దేశవ్యాప్త సమ్మెకు ఎంపీడీవో కు జిపి సిబ్బంది వినతి

మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి :

కొత్తకోట మున్సిపాలిటీలోని ఎస్సి కాలనీలో అభివృద్ధి చేసిందని కెసిఆర్ ప్రభుత్వమే అని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలోని 7,8,13, 14, 15 వ వార్డులో ఎన్నికల ప్రచార రోడ్ షో కార్యక్రమానికి ముఖ్యతితులుగా వచ్చారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ స్థానిక ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయా వార్డుల్లో చేపట్టిన డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణాలు తదితర అభివృద్ధి, సంక్షేమ పనులను వివరించారు.కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీల పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటినీ అమలు చేయలేదని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడిచినా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమై ప్రజలకు బాకీ పడిందని ఎద్దేవా చేశారు.పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోట చౌరస్తాలో గ్యారెంటీలు, హామీల అమలును కురుమూర్తి సాక్షిగా అమలు చేస్తున్నట్లు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఓట్లు అడిగే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసి, బాకీ చెల్లించిన తర్వాతే ఓట్లు అడగాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో ప్రజలకు ఎంత బాకీ పడిందో ఓటర్లు ప్రశ్నించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆరెస్ ఇంచార్జ్ అభిలాష్ రావు, మాజీ జడ్పీటీసీలు వామన్ గౌడ్, విశ్వేశ్వర్, మాజీ ఎంపీపీ గుంత మౌనిక, మాజీ సీడీసీ చైర్మన్ చెన్నకేశవ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గాడిల ప్రశాంత్, ఎద్దుల నాగేష్, ఆకుల శ్రీను, గుంత మల్లేష్, బాబు రెడ్డి, ప్రేమదానం, శాంతిరాజ్, మంద ప్రశాంత్, 14 వ వార్డు అభ్యర్థి కిరణ్, 15 వ అభ్యర్థి అయ్యన్న, నెహ్రు, ఏసు, అమర్, మహేష్, వికాస్, గులాబీ గోవింద్, మాసన్న, నవీన్ తదితరులు పాల్గొన్నారు.