Breaking News

చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి

మాజీ ఎమ్మెల్యేనాగపురి రాజలింగం గౌడ్ & యువ నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్

రోడ్డు ప్రమాదంలో భార్య మృతి, భర్త-బిడ్డ పరిస్థితి విషమం

మన ప్రగతి న్యూస్/ చేర్యాల
చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ చేర్యాల మాజీ ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం గౌడ్ , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు నాగపురి కిరణ్ కుమార్ గౌడ్ లు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి ని కలిసి
వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు
చేర్యాలను రెవిన్యూ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకత, నిత్యం చేర్యాల నియోజక వర్గంలోని పలు మండలాల ప్రజలు పడుతున్న ఇబ్బందు లను వేం నరేందర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. చేర్యాల ప్రాంత ప్రజల ఆకాంక్ష చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అని ఆయనకు వివరించారు. చేర్యాల డివిజన్ ఏర్పాటు చేయాలని వారు కోరడంతో సంబంధిత అధికారులతో మాట్లాడుతానని నరేందర్ రెడ్డి వారికి హామీ ఇచ్చారని కిరణ్ కుమార్ గౌడ్ తెలపారు.
చేర్యాల డివిజన్ ఏర్పాటు కోసం, తండ్రి కొడుకులు పడుతున్న తపన చూసి పలు మండలాల ప్రజలు వారి ఆలోచనలకు అండగా నిలుస్తున్నారు.