Breaking News

పెండింగ్ బిల్లులను మంజూరు చేయండి

తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

అందరం కలసి బాధ్యతగా ఉంటేనే ప్రతీ సమస్య పరిష్కారం

తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (బి ఆర్ టి యు ) రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి నేతృత్యంలో వరంగల్ జిల్లా సంక్షేమ అధికారిని రాజమణి ఈవో రేవతి ని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మరియు అన్ని ప్రాజెక్టులలో ఆగస్టు నెల వరకు కూరగాయలు గ్యాస్ బిల్లలు వచ్చాయని నర్సంపేట ప్రాజెక్టులో మాత్రం 2024 జనవరి నుండి ఇప్పటివరకు 11 నెలలు గడుస్తున్న బిల్లులు రాలేదని, బిల్లులు రాకపోవడంతో చేతి నుండి డబ్బులు చెల్లించి వంట చేయాల్సి వస్తుందని ఈ సమస్య పరిష్కారం కోసం ప్రాజెక్ట్ లెవెల్ లో కూడా వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. పోషణ్ ట్రాకర్ లో 2022 ఏప్రిల్ నుండి ఇప్పటివరకు ఈవెంట్స్ డబ్బులు రాలేదని చాలీచాలని వేతనాలతో గౌరవ వేతనం పేరుతో అనేక ఇబ్బందులతో అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించాల్సి వస్తుందని, సరైన టైంలో బిల్లులు రాక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పెండింగ్ బిల్స్ వెంటనే ఇప్పించాలని కోరారు. డిడబ్ల్యుఓ ని కలిసిన వారిలో ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి బత్తిని శిరీష, అధ్యక్షురాలు రమాదేవి, ప్రాజెక్ట్ నాయకురాలు సుజాత, సచీదేవి ఉన్నారు.