Breaking News

అపరిశుభ్రంగా జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల మరుగుదొడ్లు..

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి:

మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాలలో మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారాయి. మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల మరుగుదొడ్లు అస్తవ్యస్తంగా ఉండటంతో తీవ్రమైన దుర్వాసనలు వెదజ ల్లుతున్నాయి. ఈ దుర్వాసనలు పాఠశాల పరిసర ప్రాంతాలకు వ్యాపించి, తరగతి గదుల వరకు చేరడంతో విద్యార్థులు చదువుపై దృష్టి కేంద్రీ కరించలేక పోతున్నారు. దుర్వాసనాల కారణంగా కొందరు విద్యార్థులు తలనొప్పి, వాంతులు వంటి ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు సమాచారం. పరిశుభ్రత లోపం వల్ల పాఠశాల వాతావరణం కలుషితం అవుతోందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా పాఠశాల అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని ఆరోపిస్తున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. మరుగుదొడ్లను శుభ్రపరచడంతో పాటు, అవసరమైతే కొత్తగా నిర్మించి, క్రమం తప్పకుండా పరిశుభ్రత చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పాఠశాలల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సురక్షిత త్రాగునీరు అందు బాటులో ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు హాజరు శాతం పెరిగి, అభ్యాసం మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి పాఠశాలలో తక్షణమే స్వచ్ఛతా చర్యలు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఈత చెట్లు ధ్వంసం చేసిన ముదిరాజ్ వర్గం నాయకులు