మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి:
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దోతి గూ డెం గ్రామ శివారులో ఓ కె మికల్ కంపెనీలో శుక్రవా రం జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి చెందడం జ రిగింది. ఘటన స్థలాన్ని సందర్శించిన ఏసిపి మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామ శివారులో గల విజయసాయి కంపెనీలో ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన ధార ప్రవీణ్ ఒక 8 నెలలుగా కెమిస్ట్ గా విధులు నిర్వర్తిస్తున్నాడని తెలిపారు. ఇతను విధుల నిర్వహణలో భాగంగా ..శుక్రవారం నాడు రియేటర్లకు డ్రమ్ముల ద్వారా సా ల్వాన్ నింపుతున్న క్రమంలో నిప్పురవ్వలు వచ్చి డ్రమ్ము పేలిపోవడంతో ప్రవీ ణ్ అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందని ఏసీపి వివరించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటన స్థలానికి, చౌటుప్పల్ ఆర్డీవో శేఖర్ రెడ్డి, ఆర్ఐ వెంకట్ రెడ్డి, ఎస్సై భాస్కర్ రెడ్డి లు పరిశీలించారు.

