Breaking News

వేములవాడ శివారులో చిరుత కలకలం.. ఆవు దూడపై దాడి!

మన ప్రగతి న్యూస్/వేములవాడ:

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని హన్మక్కపల్లిలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. హన్మక్కపల్లి గ్రామానికి చెందిన రోమాల భూమయ్య అనే రైతుకు చెందిన పొలం సమీపంలో కట్టేసిన ఆవు దూడపై చిరుత దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది.చిరుత వేములవాడ పట్టణ శివారు వరకు చేరుకున్నట్లు సమాచారం రావడంతో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు చిరుత అడుగులను గుర్తిస్తూ పరిశీలన చేపట్టారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

కెమికల్ కంపెనీ ప్రమాదంలో వ్యక్తి మృతి..