Breaking News

అదుపుతప్పి వాహనం బోల్తా! డ్రైవర్ కు స్వల్ప గాయాలు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:

ఓ సీడ్ కంపెనీకి బయలుదేరిన వాహనం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.శంకరపట్నం మండలం కేశవపట్నం నుండి ముత్తారం వైపు వెళ్తున్న ఓ సీడ్ కంపెనీకి చెందిన బొలెరో వాహనం బయలుదేరింది. మార్గమధ్యంలో మక్త సమీపాన అదుపుతప్పి పంట పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో బొలెరో వాహన డ్రైవర్ కు స్వల్ప గాయాలతో బయటపడ్డారని స్థానికులు తెలిపారు. సీడ్ యజమాన్యం బోల్తా పడిన వాహనాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీశారు.

కెమికల్ కంపెనీ ప్రమాదంలో వ్యక్తి మృతి..