Breaking News

మాతృభాషతో పాటు, ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి..

మన ప్రగతి న్యూస్/హనుమకొండ జిల్లా:

హనుమకొండ జిల్లా ఎర్రగట్టుగుట్ట వద్ద గల శ్రీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం ఆంగ్ల అధ్యాపకుడు మహమ్మ ద్ జమాలుద్దీన్ ఆధ్వర్యంలో కమ్యూని కేషన్ స్కిల్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బీకాం ఫైనల్ ఇయర్ విద్యార్థిని కే. వర్ష “హౌ టు స్పీక్ ఇంగ్లీష్ కాన్ఫిడెంట్లి” అనే అంశం పై ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ రాజు పాల్గొని, మాట్లాడుతూ.. విద్యార్థులు తమ మాతృభాషతో పాటు ఆంగ్ల భాష పై పట్టు సాధించాలని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా ఆంగ్ల భాషను నేర్చు కోవాల్సిన పరిస్థితి నేటి కాలంలో ఉందని వాటికి అనుగుణంగానే ఉద్యోగ అవకా శాలు ఉండడంతో, ప్రతి ఒక్క విద్యార్థి ఆంగ్ల భాష పై దృష్టి సారించా లని సూచించారు. ఈ సందర్భంగా ప్రజెంటేషన్ ఇచ్చిన విద్యార్థినిని అధ్యాప కులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కె. సదా నందం, డైరెక్టర్ శివ అధ్యాపకులు రమేష్, తిరుపతి, ప్రకాష్ రెడ్డి, రాకేష్, లింగారెడ్డి, విద్యార్థులు, తదితరులున్నారు.

ఈత చెట్లు ధ్వంసం చేసిన ముదిరాజ్ వర్గం నాయకులు