బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
మన ప్రగతి న్యూస్ /నర్సంపేట
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీ మరోసారి గెలిచి అధికారంలోకి రావడంతో నర్సంపేట వరంగల్ రోడ్డు చౌరస్తాలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో టపాసులు పేలిచి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్న బీజేపీ శ్రేణులు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రదేశాలకు దీటుగా మన భారతదేశంలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని తెలియజేశారు. ఈ రోజున ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించిందని, అలాగే ప్రపంచంలోనే గొప్ప నాయకుడు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ అని తెలియచేశారు.
మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలుపు మోడీ చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమని తెలియజేశారు. అలాగే ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్రంలో అలాగే నర్సంపేట నియోజకవర్గంలో కూడా జరగబోయే అన్ని ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు వేసి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువస్తారని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహారాములు, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం ఆంజనేయులు, ఎస్టి మోర్చా జిల్లా అధ్యక్షులు బాణోత్ వీరన్న, జిల్లా కార్యదర్శి గుడిపూడి రాధాకృష్ణ, నర్సంపేట మండల అధ్యక్షులు గంగిడి మహేందర్ రెడ్డి, దుగ్గొండి మండల అధ్యక్షులు నేదురు రాజేందర్, చెన్నారావుపేట మండల అధ్యక్షులు దుంకదువ్వ రంజిత్, ఖానాపురం మండల ప్రధాన కార్యదర్శులు జల్లి మధు మరియు పాపయ్య, నూతనకంటి శ్రీనివాస్, నల్లబెల్లి మండల ప్రధాన కార్యదర్శి తడుక వినయ్, మహిళా మోర్చా జిల్లా నాయకురాలు సూత్రపు సరిత, యువ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, మాజీ వార్డ్ మెంబర్ పొదిళ్ల రామచందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి గూడూరు సందీప్, ఖానాపురం మండల నాయకులు రాదారపు అశోక్, జిల్లా యువ మోర్చా నాయకులు ఎర్ర రాజ, పల్లంకొండ శ్రీను మరియు అన్వేష్, మల్యాల సాంబమూర్తి, శివాంజన్ సింగ్, విజయ్ సింగ్, తౌటం నిశాంత్, బానోత్ రాజేందర్, తప్పెట్ల సతీష్, బట్టు మదన్, కందికొండ శ్రీను, సామల ప్రవీణ్, భక్తుల నాగరాజు, లవన్, విజయ్, రవీంద్ర చారి, రాజు, యువ మోర్చా నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.