Breaking News

వెళాల గట్టు మల్లన్న రెండోవ గిరి ప్రదక్షిణ కార్యక్రమం

సనాతన ధర్మం గొప్పతనం తెలియపరచడం కోసమే గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారoటున్న భక్తులు

ధర్మో రక్షితి రక్షితః కలిసికట్టుకుంటే ఏదైనా సాధించగలం అంటున్న ఆత్మా రామ్ మహరాజ్ అర్చకులు

ప్రతినెల ఆరుద్ర నక్షత్రం రోజు గిరి ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అంటున్న వేలాల దేవాలయ కమిటీ సభ్యులు

వేలాల గట్టు మల్లన్న స్వామికి వేణు గానంతో స్వరార్చన చేసిన మంతెన ఉదయ్ కిరణ్

జిల్లా రవాణా శాఖ అధికారుల మెరుపు దాడులు

మన ప్రగతి న్యూస్/ మంచిర్యాల జిల్లా ప్రతినిధి:

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గుట్టపైన స్వయంభుగా పాండవులచే ప్రతిష్టింపబడిన గట్టు మల్లన్న గిరి ప్రదక్షిణ డిసెంబర్ 16 ఆరుద్ర నక్షత్రం సోమవారం ఉదయం శివాలయం ప్రధాన అర్చకుడు సురేష్ ఆత్మహరం మహారాజు ఆధ్వర్యంలో రెండోసారి వైభోపేతంగా ప్రారంభం జరిగినది. రెండోసారి నిర్వహిస్తున్న గిరి ప్రదక్షణకు జిల్లా నలుమూలల నుండి విశేషంగా భక్తలు హాజరైనారు. కోలామాయంగా జన సందోహంతో హాజరైన భక్తులు శివనామ పారాయణం చేస్తూ గుడి ఉన్న గిరి చుట్టూ తిరుగుతూ ప్రదక్షణలు చేశారు.గిరి ప్రదక్షిణలో భాగంగా దివ్యాంగురాలు తన తండ్రితో కలిసి గిరి ప్రదక్షిణ చేయసాగింది అది చూసిన సురేష్ ఆత్మ రామ్ మహారాజ్ చాలా శుభ పరిణామని ఈ అమ్మాయిని చూసి మిగతావారిలో మార్పు రావాలని మనసుతో భగవంతుని స్మరించాలని అందరికీ తెలియ జేశారు.అనంతరం అమ్మాయిని అభినందించి ఆశీర్వదించారు.

చిలుకూరి బాలాజీ శివాలయ అర్చకులు సురేష్ ఆత్మా రామ్ మహరాజ్ ఆధ్వర్యంలో వేలాల గట్టు మల్లన్న గుట్టపై సుమారు 500 భక్తులతో,2వ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా గిరి ప్రదక్షిణ కు వచ్చిన భక్తుల సహకారంతో వారు ఇచ్చిన విరాళాలతో కచ్చిరు బండ పై శివ లింగాన్ని ప్రతిష్ట చేయడం జరిగింది.అనంతరం దాతల సహకారంతో అన్న వితరణ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా అర్చకులు శ్రీకాంత్,శర్మ,కర్ణ కంటి రవీందర్,మాజీ సర్పంచ్ లక్ష్మణ్,ఉప సర్పంచ్ డేగ నగేష్,రాఘవేంద్ర, రాజకుమార్,వేముల హరిప్రసాద్, మంతెన ఉదయ్ కిరణ్,తదితరులు పాల్గొన్నారు.