మన ప్రగతి న్యూస్ /చేవెళ్ల :
మొయినాబాద్ మండల పరిధిలో గల పెద్దమంగళరం గ్రామ సరిహద్దుల గల తెలంగాణ రాష్ట్ర మైనార్టీ గురుకుల పాఠశాల, కళాశాలను సీఎమ్ ఓ కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రెటరీ చంద్రశేఖర్ రెడ్డి ఐఎఫ్ఎస్ సందర్శించారు ఈ కార్యక్రమంలో కళాశాలలో వంటశాల, గ్రంథాలయం,తరగతి గదులను, కళాశాల ఆవరణ గల విద్యార్థులు ఆవస గదులను పరిశీలించారు
విద్యార్థులకు 40 శాతం పెరుగుదలను వివరిస్తూ మంచి పౌష్టికాహారాన్ని అందిస్తామని బాగా చదవు కొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు చూపుతో డైట్ మెనూ చార్జీలను పెంచారని వాక్యానించారు ఈ కార్యక్రమంలో గురుకుల మైనారిటీ కళాశాల ప్రిన్సిపాల్ రజినీ దీపా, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.